Sunday, September 13, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయం240 మందితో వెళ్తున్న నౌక ఆచూకీ గల్లంతు

240 మందితో వెళ్తున్న నౌక ఆచూకీ గల్లంతు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఇండోనేసియాలో 240 మంది ప్రయాణికులతో వెళ్తున్న నౌక ఆచూకీ.. జావా సముద్రంలో గల్లంతైంది. ‘విర్గో ట్రాన్స్‌పోర్ట్ 8’ నౌక తూర్పు జావా నుంచి దక్షిణ కాలిమంతన్‌కు వెళ్తుండగా సంబంధాలు తెగిపోయాయి. సురబయ- బంజర్‌మాసిన్‌ మధ్య ఉండగా నౌకలో సమాచార లోపం తలెత్తినట్లు అధికారవర్గాలు తెలిపాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం.. నౌక ఆచూకీని చివరిగా బంజర్‌మాసిన్‌కు సుమారు 148 కిలోమీటర్ల దూరంలో గుర్తించారు. దీంతో సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -