ప్రజా ట్రస్ట్ చెర్మన్ మోహన్ రావు పటేల్..
బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత..
నవతెలంగాణ-కుభీర్
ఖాదీర్ ఒక్కగానొక్క కుమారుడుని కోల్పోవడం చాలా బాధాకరమని, ఖాదీర్ ధైర్యంగా ఉండాలనీ, ఆయన కుటుంబానికి పెద్ద కుమారుడునవుతానని ప్రజా ట్రస్ట్ చెర్మన్ మోహన్ రావు పటేల్ అన్నారు. ఆదివారం మండల కేంద్రమైన కుభీర్ లో ఇటీవల డోడర్నా గ్రామ సమీపంలో ఉన్న ఎల్లమ్మ చేరువులో గణేష్, సోపియన్, దేవిదాస్ అనే ముగ్గురు ప్రమాదవ శాత్తు నీటిలో మునిగి మృతి చెందారు. విషయం తెలుసుకున్న మోహన్ రావు పటేల్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, అండగా ఉంటామని భరోసానిచ్చారు. మృతులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అదేవిధంగా వారికి ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో మండల నాయకులతో కలసి ఒక్కొక్కరికి రూ.10 వేల ఆర్థిక సహాయం చెక్కులను అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ముధోల్ నియోజకవర్గం లో ఉన్న బడుగు బలహీన వర్గాల ప్రజలకు అండగా ఉంటానని తెలిపారు. ఆయన వెంట పార్డి (బి) సర్పంచ్ మడి ప్రవీణ్, మండల కిషన్ మోర్చా అధ్యక్షులు సంతోష్, పుప్ఫల లింగం, స్వామి, కాంలేష్, మండల నాయకులు తదితరులు ఉన్నారు.




