Monday, September 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఊరూరా కొలువుదీరిన గణనాథులు

ఊరూరా కొలువుదీరిన గణనాథులు

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
మద్నూర్, డోంగ్లి మండలాల పరిధిలోని ప్రతి గ్రామంలో, వాడవాడలా సోమవారం గణనాథులు కొలువుదీరారు. యువకులు బ్యాండ్‌ మేళాలతో ఉత్సాహంగా.. భక్తి శ్రద్ధలతో వినాయకుడిని ఊరేగింపుగా తీసుకువెళ్లి మండపాల్లో ప్రతిష్టించారు. ఈ క్రమంలో వినాయకుడికి ఇరవై ఒక్క రకాల చెట్ల మొక్కలు, ఆకులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏకదంతుడికి ఇష్టమైన మోదాకులు, తాలుకల పాశం, పండ్లు ఫలాలు, ప్యాలాలు టెంకాయలతో నైవేద్యాలు సమర్పించారు. ఇంటింటా పనిముట్లకు ప్రత్యేక పూజలు, మండపాలను డేకరేషన్లు చేసి అందంగా అలంకరించారు. నేటితో మొదలైన పండగ 9 లేదా 11 రోజుల తర్వాత నిమజ్జనంతో ముగుస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -