•కాంగ్రెస్ మండల అధ్యక్షులు రాందాస్ శ్రీనివాస్
నవతెలంగాణ-మర్రిగూడ
సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరమని, మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ మండల అధ్యక్షులు రాందాస్ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో మంజూరైన రూ.9,54,500- విలువగల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను 26 మంది లబ్దిదారులకు ఆయా గ్రామాల సర్పంచుల ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మేతరి యాదయ్య, మాల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నక్క శ్రీనివాస్ యాదవ్, ఆయా గ్రామాల సర్పంచులు, మాజీ సర్పంచులు, ఎంపిటిసిలు, కాంగ్రెస్ మండల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
సీఎం సహాయనిధి నిరుపేదలకు వరం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



