పెరుగులో మంచి ప్రోబయోటిక్స్ ఉంటాయనేది నిజమే. కానీ గట్ ఆరోగ్యం కేవలం పెరుగుతోనే సాధ్యమవుతుందని అనుకోవడం పొరపాటు. మన భారతీయ ఆహార సంప్రదాయంలోనే గట్‌కు మేలు చేసే ఎన్నో వంటకాలు, పదార్ధాలు ఉన్నాయి. జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచే వాటిపై నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం..
మనం రోజూ తినే ఇడ్లీ, దోస వంటి వంటకాలు కేవలం రుచి కోసమే కాదు, గట్ ఆరోగ్యానికి కూడా అనుకూలంగా ఉంటాయి. ఎందుకంటే అవి సహజంగా పులియబెట్టిన పిండితో తయారవుతాయి. ఫెర్మెంటేషన్ వల్ల పిండిలో సహజ మార్పులు జరుగుతాయి. ఇవి ఇడ్లీ, దోసలను జీర్ణానికి మరింత అనుకూలంగా మారుస్తాయి. అయితే స్టీమ్‌లో వండే సమయంలో అధిక వేడి వల్ల లైవ్ బ్యాక్టీరియా ఎక్కువగా జీవించి ఉండకపోవచ్చు. అయినప్పటికీ ఇవి సులభంగా జీర్ణమయ్యే ఆహారంగా పరిగణించబడతాయి. అందుకే ఇడ్లీ, దోసలను గట్ ఫ్రెండ్లీ ఫుడ్‌గా చెప్పొచ్చు.
ఇప్పుడంటే అందరూ కుక్కర్లు వాడుతున్నారు. కానీ నిజానికి అన్నం వార్చి ఆ గంజిని తరువాతి రోజు తాగితే జీర్ణక్రియకు బాగా సహాయపడుతుంది. అదే గంజిని రాత్రి మిగిలిన అన్నంలో పోసుకుని తింటే కూడా మంచిదే. ఈ చద్ది అన్నం, గంజి రాత్రంతా ఇది సహజంగా ఫెర్మెంట్ అవ్వడం వల్ల వీటిలో ఎక్కువగా మంచి సూక్ష్మజీవులు తయారవుతాయి. అందుకే పూర్వం రోజుల్లో దీన్ని ఎక్కువగా తినేవారు. ఇప్పుడు మళ్ళీ ఇది పాపులర్ అవుతుంది.
ప్రో బయాటిక్స్ మాత్రమే కాదు ప్రీ బయాటిక్స్ కూడా అవసరమే! : కేవలం మంచి బ్యాక్టీరియాను అందించడమే కాదు, అవి కడుపులో వద్ధి చెందడానికి కావాల్సిన ఆహారాన్ని కూడా మనం తీసుకోవాలి. దీనినే ప్రీబయోటిక్ ఫైబర్ అంటారు. అలా పొట్టలో మంచి బ్యాక్టీరియా పెరగటానికి అరటి పండ్లు కూడా సహాయపడతాయి. పైగా ఇవి చవకలో వస్తాయి, అందుబాటులో ఉంటాయి. ఇతరత్రా ఆరోగ్య సమస్యలు లేనివారు అరటిపండ్లను తరచూ తీసుకుంటే ఇందులో ఉండే ఫైబర్ పొట్టలో మంచి బ్యాక్టీరియాకు ఇంధనంలా పనిచేస్తుంది. అయితే మరీ ముగ్గిపోయినవైతే రెసిస్టెంట్ స్టార్చ్ తక్కువగా ఉంటుంది. ఇవే కాకుండా పచ్చి ఉల్లిపాయలు, వెల్లుల్లి కూడా గట్ మైక్రోబయోమ్ సమతుల్యతను కాపాడతాయి. చిక్కుళ్లు, శనగల్లో ఉండే పీచు పదార్థం జీర్ణకోశాన్ని శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది.
గట్ హెల్త్ కోసం…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



