– ఐదు ద్విచక్రవాహనాలు స్వాధీనం, అదుపులో నలుగురు
నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట మండలంలో కోడిపందాలు, పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. వడ్డెరంగాపురం గ్రామ శివారులో ఆదివారం సాయంత్రం 4 గంటలకు కోడిపందాల స్థావరంపై దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.1,500 నగదు, రెండు కోడిపుంజులు, ఐదు మోటార్‌సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
అదేవిధంగా దొంతికుంట గ్రామ శివారులో సాయంత్రం 6.30 గంటలకు పేకాట స్థావరంపై దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.800 నగదు, 52 పేకముక్కలను స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు పరారైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అశ్వారావుపేట పోలీసులు వెల్లడించారు.



