- Advertisement -
నవతెలంగాణ-కుభీర్
మండల పరిధిలోని కుప్టి గ్రామంలో సోమవారం గణేష్ ఉత్సవాలు ప్రారంభించి మరసటి రోజు మంగళవారం (నేడు) నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు. గత కొన్నేండ్లుగా ఇక్కడ వినాయకుడిని ప్రతిష్టించిన మరుసటి రోజే నిమజ్జనం చేసే ఆచారం ఆనవాయితీగా వస్తోందని స్థానికులు చెప్పారు. ఇందులో భాగంగా కుభీర్ ఎస్ఐ కృష్ణారెడ్డి ఆ గ్రామాన్ని సందర్శించి గణేష్ మండపంలో ప్రత్యేక పూజలు చేసి, విఘ్నేశ్వరుడి ఆశీర్వాదాలు స్వీకరించారు. గ్రామమలో యువకులు, మహిళలు కోలాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఊరేగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పూర్తిగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్సై తెలిపారు.
- Advertisement -



