హీరో తరుణ్ భాస్కర్, రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్ కాంబి నేషన్‌లో రాబోతున్న చిత్రం ‘గాయపడ్డ సింహం’. పవన్ సాదినేని సమర్పణలో కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజరు కష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్ల పై నిర్మించారు.
ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలుగా నటిం చారు. జేడి చక్రవర్తి కీలక పాత్ర పోషించారు.
ఈ సినిమా మే 1వ తేదీన ప్రపం చవ్యాప్తంగా థియేటర్లలో విడు దల కానుంది. ఈ సందర్భంగా యాక్టర్ జేడి చక్రవర్తి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
– క్యారెక్టర్ ఆర్క్‌లో ఏదైనా ఛాలెంజ్ ఉంటే ఏ నటుడికైనా చాలా ఎక్సైటింగ్‌గా ఉంటుంది. ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఇందులో చేశాను. ఒకే క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్‌లో ఒక షేడ్, సెకండ్ హాఫ్‌లో మరో షేడ్ ఉండటం మామూలే. కానీ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ రెండింటిలో ఒకే విధంగా కనిపిస్తూ, రెండు షేడ్స్‌లో కనిపించడం నన్ను చాలా ఎగ్జైట్ చేసింది. అది ఎలా అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. అలా చేయడానికి నేను చాలా కష్టపడ్డాను అని చెప్పడం లేదు. కథలోనే ఆ బలం, మ్యాజిక్ కుదిరింది.
-కథ వర్క్ అవుట్ అయితేనే సినిమా ఆడుతుంది. ‘శివ’లో నా క్యారెక్టర్ నా పేరుగా మారిపోయింది. చక్రవర్తి అంటే గుర్తుపట్టరు, జేడీ చక్రవర్తి అంటే గుర్తుపడతారు. అలాగే భవాని, సత్య, భీకు మాత్రే, కల్లుమామ ఇలా చాలా పాత్రలు గుర్తుండిపోయాయి. కానీ కథ వర్కౌట్ కాకపోతే క్యారెక్టర్లు నిలవవు. ఒకవేళ నిలిచినా.. సినిమా ఆడదు. నా కెరీర్‌లో ఫేవరెట్ క్యారెక్టర్ ‘వైఫ్ ఆఫ్ వి వరప్రసాద్’. ఆ పాత్ర వర్క్ అవుట్ అయ్యింది. కానీ సినిమా ఆడలేదు.
– ఇందులో తరుణ్ భాస్కర్ గాయపడ్డాడు, నేను గాయపడ్డాను, ఇంకో సింహం కూడా గాయపడింది. ఆ సింహం ఎవరో త్వరలో రివీల్ చేస్తాం.
-ఈ కథను చాలా కొత్తగా ప్రెజెంట్ చేశారు. ఇందులో ధర్మా క్యారెక్టర్, తరుణ్ భాస్కర్ చేసిన దరహస్, ఇంకో పాత్ర …ఇవన్నీ కలిసే విధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది.
– కశ్యప్‌కి షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్‌లు చేసిన మంచి అనుభవం వుంది. తన స్టైల్ నాకు చాలా నచ్చింది. చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటాడు. రియలిస్టిక్, హిలేరియస్ హ్యూమర్‌తో సినిమా తీశాడు.
కథలోనే ఆ మ్యాజిక్ కుదిరింది
- Advertisement -
- Advertisement -



