– తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో రికార్డు స్థాయిలో ఓటింగ్
– బెంగాల్‌లో ఘర్షణలు.. పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తం
– ఓటేసిన సినీతారలు, ప్రముఖులు
న్యూఢిల్లీ: తమిళనాడు, పశ్చిమబెంగాల్(తొలివిడత) అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. గతంతో పోల్చితే పశ్చిమబెంగాల్‌లో 91.35 శాతం నమోదైనట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. తమిళనాడులో 82.24శాతం పోలింగ్ నమోదైంది. చెన్నైలో 84.29 శాతం పోలింగ్ నమోదు కాగా బెంగాల్‌లోని దక్షిణ్ దినాజ్‌పూర్‌లో అత్యధికంగా 93.12శాతం పోలింగ్ నమోదైనట్టు వెల్ల డించారు. సాయంత్రం 6గంటలతో పోలింగ్ సమయం ముగియగా.. అప్పటికే క్యూలైన్లలో ఉన్న వారికి ఓటు వేసేందుకు అనుమతించారు.
తమిళనాడులో 234 స్థానాలకు, పశ్చిమ బెంగాల్‌లో తొలివిడతలో భాగంగా 152 స్థానాలకు పోలింగ్ ప్రక్రియ నిర్వహించారు. ఉదయం 7గంటలకే పోలింగ్ ప్రారంభమైనప్పటికీ ఓటర్లు ఎండను సైతం లెక్క చేయకుండా భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తొలి గంటల్లోనే పలువురు ప్రముఖులు పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తన కుటుంబసభ్యులతో వచ్చి ఓటు వేశారు. సినీతారలు, ప్రముఖ రాజకీయ నాయకులు రజనీకాంత్, కమల్‌హాసన్, టీవీకే అధినేత విజరు తదితరులు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు.
పశ్చిమబెంగాల్‌లో అక్కడక్కడ ఉద్రిక్తతలు
పశ్చిమ బెంగాల్‌లోని పలు జిల్లాల్లో ఉద్రిక్తత, అశాంతి నెలకొన్నట్టు వార్తలు వచ్చాయి. ముర్షిదాబాద్‌లో టీఎంసీ కార్యకర్తలకు, ఏయూజేపీ వ్యవస్థాపకుడు హుమాయున్ కబీర్‌కు మధ్య ఘర్షణ జరిగింది.సిలిగురిలో టీఎంసీ, బీజేపీ కార్య కర్తల మధ్య వేర్వేరు ఘర్ష ణలు జరిగినట్టు సమా చారం. కుమార్ గంజ్‌లో తన పోలింగ్ ఏజెంట్లను పలు బూత్‌ల నుంచి తొల గించారని బీజేపీ అభ్యర్థి సువేందు సర్కార్ ఆరోపిం చారు.తనపై దాడి జరిగిం దనీ ఆయన పేర్కొన్నారు.




