నవతెలంగాణ-హైదరాబాద్: యూపీఐ చెల్లింపుదారులకు బీజేపీ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. రూ. 2,000 కంటే ఎక్కువ విలువైన UPI లావాదేవీలపై 0.4 శాతం ‘మర్చంట్ డిస్కౌంట్ రేట్’ (MDR) వర్తిస్తుందని వెల్లడించింది. ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) వివరాలు ప్రకటించింది. ఈ సవరించిన UPI మర్చంట్ డిస్కౌంట్ రేట్ విధానం 2026 అక్టోబర్ 15 నుండి అమల్లోకి రానుంది.కొత్త విధానం కింద, రూ. 2,000 కంటే ఎక్కువ విలువైన ‘పర్సన్-టు-మర్చంట్’ (P2M) UPI లావాదేవీలపై 0.4 శాతం MDR వర్తిస్తుంది, అలాగే ఒక్కో లావాదేవీకి గరిష్ట MDR పరిమితి రూ. 300గా నిర్ణయించబడింది.
ఎండీఆర్ ఫ్రేమ్ వర్క్ కింద నెలకు రూ.లక్ష వరకు బ్యాంక్ ఖాతాలోకి క్యూఆర్ కోడ్ ద్వారా స్వీకరించే చిన్న వ్యాపారులకు ఎండీఆర్ వర్తించదని స్పష్టంచేసింది. రైల్వేలు, టెలికాం సేవలు, బీమా, ఇంధనం వంటి నిర్దిష్ట విభాగాల్లో రూ.2,000 దాటిన చెల్లింపులకు ఒక్కో లావాదేవీకి ఫ్లాట్‌గా రూ.5 ఎండీఆర్ వర్తిస్తుందని తెలిపింది. (upi mdr charges news) ఇతర లావాదేవీలకు రూ.2,000 దాటిన మొత్తాలపై 0.4 శాతం ఎండీఆర్ విధించనున్నట్లు పేర్కొంది.



