- Advertisement -
హైదరాబాద్ హార్స్ షో ఫైనల్స్
నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ హార్స్ షో ఫైనల్లో ఐజా మిర్ అద్భుత ప్రదర్శన కనబరిచింది. అండర్-14 విభాగం 110-115సెమీ షో జంపింగ్ పోటీల్లో ఐజా మిర్ సత్తా చాటింది. ఈ విభాగంలో అగ్రస్థానంలో నిలిచి పసిడి పతకం సాధించిన ఐజా మిర్.. అండర్-14 విభాగం 100 సెమీ షో జంపింగ్‌లో నాల్గో స్థానంలో నిలిచింది. 25 మంది పోటీపడిన ఫైనల్లో ఐజా మిర్‌తో పాటు సెంతిల్, ఈశన్ భరద్వాద్, సంజయ్, ప్రభునూర్ సింగ్, వేదిక్, ఆమిర్, మిర్ నజముద్దీన్ ఆజామ్‌లు పతక ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.
- Advertisement -



