టెహ్రాన్ : మధ్యప్రాచ్యంలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లను ప్రయోగిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ దాడుల్లో చాలా వరకూ గురి తప్పకుండా నేరుగా లక్ష్యాలను తాకుతున్నాయి. రష్యా ఉపగ్రహాలు అందజేస్తున్న సమాచారమే దీనికి కారణమని సీఎన్‌ఎన్ వార్తా సంస్థ విశ్లేషించింది. మార్చి 27న సౌదీ అరేబియాలో అమెరికాకు చెందిన ‘ప్రిన్స్ సుల్తాన్’ వైమానిక స్థావరంపై ఇరాన్ దాడి చేసింది. దానికి రెండు రోజుల ముందు రష్యాకు చెందిన 14 గూఢచర్య ఉపగ్రహాలు ఆ స్థావరంపై తిరిగాయి. అవి ప్రయాణించిన సమయం, క్రమం కారణంగా ఆ స్థావరానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇరాన్ సేకరించగలిగింది. ఈ ఉపగ్రహాలు వీడియోలను చిత్రీకరించడంతో పాటు కమ్యూనికేషన్ వ్యవస్థకు కూడా అంతరాయం కలిగించాయి. అమెరికా స్థావరంపై ఇరాన్ జరిపిన ఆ దాడిలో 12 మంది సైనికులు గాయపడ్డారు. రాడార్‌ను గుర్తించి, దానిని నియంత్రించే అమెరికా విమానం ధ్వంసమైంది. దీని విలువ అనేక వందల మిలియన్లు ఉంటుందని అంచనా. మధ్యప్రాచ్యంలోని అమెరికా స్థావరాలు, కమాండ్ కేంద్రాలు, లాజిస్టిక్ సౌకర్యాలు, నౌకాదళ మౌలిక సదుపాయాలపై దాడులకు ప్రణాళికలు రూపొందించడానికి కూడా రష్యా ఉపగ్రహ డేటాను ఉపయోగించవచ్చునని సీఎన్‌ఎన్ తెలిపింది. జూలైలో సీఐఏకి చెందిన మౌలిక సదుపాయాలపై ఇరాన్ జరిపిన దాడులలో రష్యా ప్రమేయంపై అమెరికా నిఘా సంస్థలు విచారణ జరుపుతున్నాయి.
గురి తప్పని ఇరాన్ దాడులు రష్యా ఉపగ్రహ డేటాయే కారణం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



