Thursday, September 17, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంబీఆర్‌ఎస్‌ హయాంలో నేభూ అక్రమాలు

బీఆర్‌ఎస్‌ హయాంలో నేభూ అక్రమాలు

- Advertisement -

అసైన్డ్‌ భూములు ఎవరు రిజిస్ట్రేషన్‌ చేసినా తప్పే : రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

​నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

బీఆర్‌ఎస్‌ ‌సర్కార్‌ ‌హయాంలోనే ధరణి పేరిట పెద్ద ఎత్తున భూ అక్రమాలు జరిగాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం అసెంబ్లీ లాబీల్లో ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ… తన మామ భూములకు గత కాంగ్రెస్‌ ప్రభుత్వమే ఎన్‌ఓసీ ఇచ్చిందన్న హరీశ్‌రావు వ్యాఖ్యలపై స్పందించారు. అసైన్డ్‌ భూములకు అనుమతి ఇవ్వడం చట్టబద్ధం కాదనీ, ఆ పని ఏ ప్రభుత్వం తప్పేనని అన్నారు. ఆ విషయం హరీశ్‌రావుకు తెలియదా? అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి భూదాన్‌ భూమిని నకిలీ ఎన్‌ఓసీతో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారని పొంగులేటి ఆరోపించారు. అది కూడా తప్పేనని అన్నారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్‌ విషయంలోనూ నిషేధిత భూమి రిజిస్ట్రేషన్‌ జరిగిందని అన్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో స్టేటస్‌కో ఉత్తర్వులు ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారని పేర్కొన్నారు. 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూముల్లో నాలుగు లక్షల ఎకరాలు మాత్రమే పట్టా భూములనీ, మిగిలిన భూమంతా ప్రభుత్వ భూమేనని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 22ఏ జాబితా నుంచి 47,440 ఎకరాలు తగ్గించినట్లు అసెంబ్లీలో ఇప్పటికే వెల్లడించినట్టు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -