Friday, September 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉద్యోగులు సమయపాలన పాటించాలి

ఉద్యోగులు సమయపాలన పాటించాలి

- Advertisement -

 జిల్లా ఇన్చార్జి కలెక్టర్ భాస్కర్ రావు..
నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్ 

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో కలెక్టరేట్లో పని చేసే ఉద్యోగులందరూ ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజల కోసం పనిచేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఇన్చార్జి కలెక్టర్ భాస్కర్ రావు కోరారు. కాగా శుక్రవారం ఉదయం 10:40 నిమిషాలకు కలెక్టరేట్ గేటు వద్ద స్వయంగా సమయపాలన పాటించని ఉద్యోగులను  ఆపి  వారితో మాట్లాడారు. ప్రజల కోసమే మనం పని చేస్తున్నామని ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, కచ్చితంగా ఉదయం 10 గంటల 30 నిమిషాలకు  ఆయా శాఖ ఆఫీసులో అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. లేనియెడల వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల కోసమే ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తుందని, అధికారులకు సమయపాలన ముఖ్యమైందని అన్నారు. సమయపాలన పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని, జిల్లావ్యాప్తంగా అధికారులు అందరూ అనగా డివిజన్, మండల,  గ్రామస్థాయి అధికారులు సమయపాలన పాటించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -