Friday, September 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంగ్రెస్ పార్టీలో చేరిన లింగంపల్లి యువత 

కాంగ్రెస్ పార్టీలో చేరిన లింగంపల్లి యువత 

- Advertisement -

నవతెలంగాణ-నవాబుపేట
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను హామీలను ఆకర్షితులై లింగంపల్లి గ్రామానికి చెందిన 30 మంది యువకులు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు తానం సుధాకర్ ఆధ్వర్యంలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాతృమూర్తి శశికళ రెడ్డి సమక్షంలో వారిని పార్టీలోకి ఆహ్వానించి కండువా కప్పి ఘనంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధికి తాము కూడా అనుకూలంగా ఉంటూ అభివృద్ధిలో భాగస్వాములు అవుతామని స్వయంగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చామని తెలిపారు. ఈ సందర్భంగా వారిని చేర్చుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని, పార్టీలో భాగస్వాములుగా చేస్తూ ప్రభుత్వ పరంగా వారికి అందే అభివృద్ధి సంక్షేమ ఫలాలు నిష్పక్షపాతంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు ముంత యాదయ్య, అంబదాస్ నాయక్, బంక వెంకటయ్య, కోస్గి రాజు, మల్లేష్,లింగంపల్లి నాయకులు సుధాకర్ రెడ్డి, వినోద్ రెడ్డి, గోవిందుగారి నర్సింలు, శేఖరయ్య నవీన్, కొంగల కృష్ణయ్య, కొంగళ్ళ అంజిలయ్య, ఎర్రోళ్ల సత్తయ్య, కొంగల యాదయ్య, కొంగల అంజయ్య, ప్రకాష్ భాను, ప్రకాష్ మల్లేష్, నరేష్, లింగమయ్య, యాదయ్య, శివకుమార్, విఘ్నేష్, సత్యం తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -