నవతెలంగాణ – బాల్కొండ : బాల్కొండ మండల కేంద్రానికి చెందిన సంజీవ్ గౌడ్‌ను కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిగా నియమిస్తూ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగేష్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్లు మండల అధ్యక్షుడు సట్ల గంగా ప్రవీణ్ శుక్రవారం తెలిపారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిగా నియమించినందుకు సహకరించిన కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇన్‌చార్జి ముత్యాల సునీల్ కుమార్, మాజీ విప్ ఈరవత్రి అనిల్, జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి లకు సంజీవ్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా అధ్యక్షుడు నాగేష్ రెడ్డి తనపై ఉంచిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని సంజీవ్ గౌడ్ అన్నారు.
కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిగా సంజీవ్ గౌడ్ నియామకం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



