Saturday, September 19, 2026
E-PAPER
Homeఎడిట్ పేజికేటీఆర్‌‌కు అనువైన ఇల్లే లేదట!

కేటీఆర్‌‌కు అనువైన ఇల్లే లేదట!

- Advertisement -

అయ్యో పాపం! ఇన్నాళ్లూ హైదరాబాద్ మహానగరంలో అందరికీ అన్నీ ఉన్నాయనుకున్నాం గానీ… మన మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారి కుటుంబానికి ఉండటానికి ఒక ‘అనువైన ఇల్లే’ దొరకలేదనే చేదు నిజాన్ని గ్రహించలేక పోయాం! పాపం, వేల చదరపు అడుగుల్లో విల్లాలున్నా, గేటెడ్‌ అపార్ట్‌మెంట్లున్నా… కుటుంబమంతా ఒకేచోట సంతోషంగా ఉండటానికి హైదరాబాద్ చాలకపోవడం ఎంతటి విషాదం! ఆ బాధ తాళలేకనే కదా, గతిలేక ఊరు చివర ఉన్న ఎకరాల కొద్దీ ఫామ్‌హౌస్‌లలో ‘నెట్టుకురావాల్సి’ వస్తోంది.‘మా కుటుంబం మొత్తం కలిసి ఉండటానికి హైదరాబాద్‌లో అనువైన ఇల్లే లేదు. అందుకే మేమూ ఎక్కడెక్కడో ఫామ్‌‌హౌస్‌‌ల్లో ఉండాల్సి వచ్చిందయ్యా బాబూ…అలా ఉండటానికి మాకేమైనా కాయిసా’ అంటూ ఆయన అన్న మాటలు సోషల్‌ ‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల ఇబ్బందులు చూసి ‌కేటీఆర్‌ గారు ఎంతగా చలించిపోయారో గుర్తు తెచ్చుకోండ్రి? ‘‘బిడ్డ, అల్లుడొస్తే ఉండటానికి చోటు లేదు, ఓ వైపు కోళ్లు, ఇంకోవైపు మేకల నడుమ కాళ్ల దగ్గర పడుకునే దుస్థితి మనకొద్దు’’ అని ఆవేదన చెందితిరి. పేదలకు కొన్నిచోట్ల డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు కట్టించితిరి. కానీ పాపం, ఆయన దృష్టిలో ‘అనువైన ఇల్లు’ అంటే రెండు డబుల్ బెడ్‌రూమ్‌లో, నాలుగు ట్రిపుల్ బెడ్‌రూమ్‌లో కాదని ప్రజలు ఇప్పటికిగానీ గ్రహించలేకపోతిరి! ఆయన దృష్టిలో ‘అనువైన ఇల్లు’ అంటే కనీసం రెండు మూడెకరాల్లో విస్తరించిన ఫామ్‌హౌస్, చుట్టూ ఆహ్లాదాన్నిచ్చే పచ్చని పండ్ల తోటలు, కల్తీ లేని స్వచ్ఛమైన పాలు, పొలం నుండి అప్పుడే కోస్కొచ్చిన తాజా కూరగాయలు, ప్రాణంగా పెంచుకున్న పొట్టేళ్లు, మేకపోతులు, నాటుకోళ్ల ఘుమఘమలు! అలాంటి కనీస వసతులు కూడా హైదరాబాద్ నగరంలో దొరక్కపోవడం మన పాలనా వ్యవస్థ వైఫల్యం కాక మరేమిటి? ప్రభుత్వం వెంటనే స్పందించి, మహానగరంలో ఉన్న ప్రతి ఒక్కరికీ కేటీఆర్ గారు చెప్పినట్లు ‘అనువైన ఇండ్లు’ మంజూరు చేయాలని తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు!​
– గుడిగ రఘు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -