Tuesday, September 22, 2026
E-PAPER
Homeఆటలుగురి తప్పని హిమాన్షు

గురి తప్పని హిమాన్షు

- Advertisement -

20వ ఆసియా క్రీడల్లో మూడోరోజు భారత్‌కు మూడు పతకాలు దక్కాయి. షూటింగ్‌లో రజత, కాంస్యాలతోపాటు ఎంఎంఏలో మరో కాంస్య పతకం లభించింది. స్విమ్మింగ్‌లో శ్రీహరి నటరాజన్‌ ఫైనల్‌కు చేరగా.. పురుషుల బ్యాడ్మింటన్‌లో పురుషుల జట్టు బంగ్లాదేశ్‌ను ఓడించి ప్రీ క్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది. పురుషుల 10మీ. ఎయిర్‌ రైఫిల్‌ ఫైనల్లో హిమాన్షు దిల్లాన్‌ రజత పతకాన్ని, రుద్రాంక్ష‍ పాటిల్‌ కాంస్య పతకాన్ని సాధించగా.. మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌(ఎంఎంఏ)లో సుచికా తారియాల్‌ తృటిలో సెమీస్‌లో ఓడి కాంస్య పతకానికి పరిమితమైంది.

ఐచి-నగోయా(జపాన్‌): 20వ ఆసియా క్రీడల్లో మూడోరోజు భారత్‌కు మూడు పతకాలు దక్కాయి. షూటింగ్‌లో రజత, కాంస్యాలతోపాటు ఎంఎంఏలో భారత్‌కు మరో కాంస్య పతకం లభించింది. స్విమ్మింగ్‌లో శ్రీహరి నటరాజన్‌ ఫైనల్‌కు చేరగా.. పురుషుల బ్యాడ్మింటన్‌లో భారత పురుషుల జట్టు బంగ్లాదేశ్‌ను ఓడించి ప్రీ క్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది. సోమవారం జరిగిన పురుషుల 10మీ. ఎయిర్‌ రైఫిల్‌ ఫైనల్లో హిమాన్షు దిల్లాన్‌ రజత పతకాన్ని, రుద్రాంక్ష‍ పాటిల్‌ కాంస్య పతకాన్ని సాధించారు. ​మహిళల టేబుల్‌ టెన్నిస్‌లో పాకిస్థాన్‌పై 
భారత్‌ ఘన విజయం సాధించింది.

​కబడ్డీ జట్టు శుభారంభం
భార‌త పురుషుల క‌బ‌డ్డీ జ‌ట్టు శుభారంభం చేసింది. గ్రూప్‌-ఎలో భాగంగా సోమ‌వారం జ‌రిగిన మ్యాచ్‌లో భార‌త్ 49-24 పాయింట్ల తేడాతో ఆతిథ్య జ‌పాన్‌ను ఓడించింది. ఎనిమిది సార్లు క‌బ‌డ్డీ చాంపి య‌న్ భార‌త్ ముందు జ‌పాన్ ఆట‌లు సాగ‌లేదు. అర్ధభాగం ముగిసేస‌రికే భార‌త్ 31-9 పాయింట్లతో జ‌పాన్‌పై స్ప‌ష్ట‌మైన ఆధిక్యంలో నిలిచింది. రెండో అర్ధభాగంలోనూ 40-12తో దూకుడు క‌న‌బ‌రిచింది. ఆశూ మాలిక్‌, దేవాంక్ ద‌లాల్ ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆకట్టుకున్నారు. అయితే ఈ మ్యాచ్‌లో సీనియ‌ర్లు ప‌వ‌న్ సెహ్రావ‌త్‌, అర్జున్ దేశ్వాల్‌, అస్లామ్ ఇనామ్‌దార్‌లు కొద్దిసేపు మాత్ర‌మే బరిలోకి దిగారు. ఆశూ సూప‌ర్ రైడ్‌తో మూడు టాకిల్ పాయింట్లు సాధించాడు. రెండో గ్రూప్‌ లీగ్‌ మ్యాచ్‌లో భారతజట్టు రిప‌బ్లిక్ ఆఫ్ కొరియాతో త‌ల‌ప‌డ‌నుంది.

పురుషుల బ్యాడ్మింటన్‌ క్వార్ట‌ర్స్‌కు…
బ్యాడ్మింట‌న్ పురుషుల విభాగంలో భారతజట్టు క్వార్ట‌ర్ ఫైన‌ల్లో అడుగుపెట్టింది. సోమవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో భారతజట్టు 3-0తో బంగ్లాదేశ్‌పై విజ‌యం సాధించింది. తొలి సింగిల్స్‌లఓ ల‌క్ష్య‌సేన్ 21-4, 21-12తో జ‌మాన్ అయ్‌మ‌న్‌పై, రెండో సింగిల్స్‌లఓ ఆయుశ్ శెట్టి 21-4, 21-13తో గౌర‌బ్ సింఘాపై, చివ‌రి మ్యాచ్‌లో కిదాంబి శ్రీకాంత్ 21-15, 21-9తో జుమ‌ర్ అల్ అమిన్‌పై విజ‌యం సాధిం చారు. మంగళవారం జరిగే క్వార్టర్‌ఫైనల్లో భారత పురుషుల జ‌పాన్ జ‌ట్టుతో త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే భార‌త్ పతకం ఖాయం కానుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -