స్పీకర్‌ను దూషించారన్న ఆరోపణల కేసులో..
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను దూషించారన్న ఆరోపణలతో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధుసూదన్, నవీన్ కుమార్‌రెడ్డిలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రిమాండ్‌ను తిరస్కరిస్తూ ఈనెల ఎనిమిదిన కింది కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలంటూ ఏసీపీ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ మధుసూదన్ రావు సోమవారం విచారించారు. పీపీ వాదిస్తూ స్పీకర్ కులం తెలిసేలా కావాలనే అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీలను రిమాండ్‌కు పంపేందుకు మెజిస్ట్రేట్ నిరాకరించడం చట్ట వ్యతిరేకమన్నారు. పలువురు సాక్షుల వాంగ్మూలాలతోపాటు వీడియో ఫుటేజీలను సేకరించి కోర్టుకు సమర్పించినప్పటికీ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ప్రత్యేక కోర్టు పరిధిలో ఉన్నందున మెజిస్ట్రేట్ రిమాండ్‌ను తిరస్కరించలేరని చెప్పారు. ఆ ఉత్తర్వులను రద్దు చేసి ఎమ్మెల్సీల రిమాండ్‌కు ఆదేశించాలన్నారు. కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 23వ తేదీకి వాయిదా వేసింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు హైకోర్టు నోటీసులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



