Homeతాజా వార్తలుఅమరచింతలో నవతెలంగాణ సర్క్యులేషన్ క్యాంపెయిన్ ప్రారంభం

అమరచింతలో నవతెలంగాణ సర్క్యులేషన్ క్యాంపెయిన్ ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ – ఆత్మకూర్ 
అమరచింత పట్టణంలో గురువారం నవతెలంగాణ దినపత్రిక సర్క్యులేషన్ క్యాంపెయిన్ ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి.ఎస్. గోపి ముఖ్య అతిథిగా హాజరై క్యాంపెయిన్ ను ప్రారంభించారు. ప్రజల పక్షాన నిలిచే నవతెలంగాణ పత్రికను ప్రతి ఇంటికి చేర్చాలని, ప్రతి కార్యకర్త, అభిమాని పత్రిక అభివృద్ధికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నిజమైన వార్తలు, ప్రజా సమస్యలపై నిక్కచ్చిగా రాసే పత్రిక నవతెలంగాణ మాత్రమేనని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు ఎస్. రాజు, మండల కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్. అజయ్, సీనియర్ నాయకులు బుచ్చన్న, శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పట్టణంలోని వ్యాపారస్తులు, ఉద్యోగులు, కార్మికులను కలిసి నవతెలంగాణ పత్రిక ప్రాధాన్యతను వివరించి, చందాదారులుగా చేరాలని కోరారు. ఈ సర్క్యులేషన్ క్యాంపెయిన్ వారం రోజుల పాటు మండల వ్యాప్తంగా కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -