ఎస్ఓ టూ జీఎంకు ఏఐటీయూసీ వినతి
నవతెలంగాణ-సత్తుపల్లి
జేవీఆర్ ఓపెన్ కాస్ట్ (జేవీఆర్ ఓసీ) ప్రాజెక్టులో అధిక ఉత్పత్తి సాధిస్తున్న కార్మికులకు ప్రోత్సాహక ఇన్సెంటివ్ అందించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) నాయకులు ఎస్ఓ టూ జీఎం బొల్లం శ్రీనివాస్‌కు గురువారం వినతిపత్రం సమర్పించారు. ఈ నెలలో ఉత్పత్తి లక్ష్యం 165 శాతానికి పైగా నమోదైనప్పటికీ ఇన్సెంటివ్ రాకపోవడంతో కార్మికులు నిరుత్సాహానికి గురయ్యారని తెలిపారు. రాబోయే రోజుల్లో సంస్థ నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలంటే కార్మికులకు వెంటనే ఇన్సెంటివ్ చెల్లించాలని కోరారు. దీనిపై ఎస్ఓ టూ జీఎం బొల్లం శ్రీనివాస్ సానుకూలంగా స్పందించి, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి బ్రాంచ్ ఉపాధ్యక్షులు దారా భీమయ్య, జేవీఆర్ పిట్ కార్యదర్శి జి. నరసింహారావు, యూనియన్ నాయకులు బుగ్గ సుధాకర్, వీరభద్రం, కోటేశ్వరరావు, కిరణ్, తేజస్ పాల్గొన్నారు.
జేవీఆర్ ఓసీ కార్మికులకు ఇన్సెంటివ్ ఇవ్వాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



