Homeరాష్ట్రీయంగణేష్ నిమజ్జన సందర్శకులకు మెట్రో ఊరట

గణేష్ నిమజ్జన సందర్శకులకు మెట్రో ఊరట

- Advertisement -

నేడు అర్ధరాత్రి దాటే వరకు
ప్రత్యేక సర్వీసులు
ట్రాఫిక్, పార్కింగ్ కష్టాలు లేకుండా సాఫీగా ప్రయాణం
అన్ని టెర్మినల్ స్టేషన్ల నుంచి 
చివరి మెట్రో రైలు ఒంటి గంటకు

నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యంత వైభవోపేతంగా జరిగే గణేష్ నిమజ్జన వేడుకలకు తరలివచ్చే సందర్శకులకు హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ శుభవార్త అందించింది. నిమజ్జనం రోజున నగరంలో ట్రాఫిక్ రద్దీ, పార్కింగ్ ఇబ్బందులను అధిగమించి సురక్షితంగా ప్రయాణించేందుకు వీలుగా మెట్రో రైలు సేవల వేళలను పొడిగించింది. ఈ నెల 25వ తేదీ (శుక్రవారం) అర్ధరాత్రి దాటిన తర్వాత 1 గంట వరకు (సెప్టెంబర్ 26 తెల్లవారుజాము) రైళ్లు నడపనున్నట్టు అధికారులు ప్రకటించారు. నిమజ్జనం సందర్భంగా ప్రధానంగా హుస్సేన్‌సాగర్‌తో పాటు శోభాయాత్ర సాగే ప్రధాన రహదారులన్నీ జనసందోహంతో కిక్కిరిసిపోతాయి. వాహనదారులు తీవ్ర ట్రాఫిక్ జామ్‌లు, పార్కింగ్ సమస్యలతో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు మెట్రో ఉత్తమ ప్రత్యామ్నాయమని అధికారులు తెలిపారు. ప్రజలు ఎలాంటి అసౌకర్యానికీ గురికాకుండా వేడుకల్లో పాల్గొని సులభంగా తమ గమ్యస్థానాలకు చేరుకునేలా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

​చివరి రైళ్ల సమయాలివే..
ఈ పొడిగించిన సేవల ప్రకారం.. సెప్టెంబర్ 26 (శనివారం) తెల్లవారుజామున సరిగ్గా ఒంటి గంటకు అన్ని టెర్మినల్ స్టేషన్ల నుంచి ఆఖరి రైళ్లు బయలుదేరుతాయి. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా స్టేషన్లలో అదనపు సిబ్బందిని, తగిన భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భక్తులు, నగర పౌరులు ఈ సేవలను వినియోగించుకొని ప్రశాంతంగా నిమజ్జన వేడుకల్లో పాల్గొనాలని మెట్రో యాజమాన్యం విజ్ఞప్తి చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -