శ్రీధర్‌ బాబు గెలుపుతో మేడారంలో మొక్కులు చెల్లించుకున్న మాజీ జడ్పిటిసిలు

నవతెలంగాణ-ముత్తారం : మంథని నియోజక వర్గంలో ఎమ్మెల్యేగా దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఘన విజయం సాధించి, రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినందుకు గాను మేడారం సమ్మక్క సారలమ్మలకు మాజీ జడ్పిటిసిలు నాగినేని జగన్మోహన్‌ రావు, మైదం భారతి వర ప్రసాద్‌లు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్టోబర్‌ 17వ తేదీన శ్రీధర్‌ బాబు మంథనిలో భారీ మెజారిటీతో గెలిచి, రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక, ప్రభుత్వంలో కీలక మంత్రి పదవీ తీసుకోవాలని అమ్మవార్లను మొక్కుకున్నామని, అనుకున్నట్లుగానే అమ్మవారి ఆశీర్వాదాలతో శ్రీధర్‌ బాబు మంథని ఎమ్మెల్యేగా గెలిచి, రాష్ట్ర మంత్రిగా కీలక బాధ్యతలు తీసుకోవడంతో మొక్కులు చెల్లించుకున్నామని తెలిపారు. అమ్మవారి ఆశీర్వాదాలతో మళ్ళీ వచ్చే ప్రభుత్వంలో శ్రీధర్‌ బాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాలని అమ్మవార్లకు మొక్కుకున్నట్లు వారు తెలిపారు. శ్రీధర్‌ బాబు మరింత ఉన్నత స్థానానికి ఎదిగి మంథని నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివఅద్ధి చేసేలా అమ్మవారు శక్తి ప్రసాదించాలని వేడుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక పేద ప్రజలకు ఆరు గ్యారెంటీ పథకాలతో ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఇప్పటికే రెండు పథకాలు అమలు చేసి ప్రభుత్వం చూపించిందని, మరో నాలుగు పథకాలను త్వరలోనే అమలవుతాయన్నారు. వారి వెంట ఆదివారం పేట కాంగ్రెస్‌ నాయకులు మైదం బుచ్చయ్య, వెపచేట్టు రాజేశం, అట్టె తిరుపతి రెడ్డి, చింతల శ్రీనివాస్‌ రెడ్డి, కన్నూరి నర్సింగరావు, చేవుల కోటి, గొడితల సంతోష్‌, కన్నూరి శ్రీకాంత్‌తో 30 మంది కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గన్నారు
Spread the love