
తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో పీజీ మూడో, ఐదు, ఏడు, తొమ్మిది సెమిస్టర్ 5వ రోజు బుధవారం పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి.
ఈ పరీక్షలు తెలంగాణ యూనివర్సిటీ లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, న్యాయ కళాశాల, దక్షిణ ప్రాంగణం, గిరిరాజ్ డిగ్రీ కళాశాల , ఆర్మూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల , బాన్సువాడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కేంద్రాల లో జరుగుతున్నాయి. ఉదయం పరీక్షకు 900 అభ్యర్థుల కు గాను 850 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం పరీక్ష కు 158 మందికి 157 హాజరయ్యారు పరీక్ష కేంద్రాలను పర్యవేక్షించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్. గంటా చంద్రశేఖర్ తెలిపారు.