హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న ఫార్మాలిటికా 2023

నవతెలంగాణ – హైదరాబాద్: 25 మే 2023: ఫార్మాస్యూటికల్ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫార్మాలిటికా ఎక్స్‌పో 9వ ఎడిషన్ జూన్ 1వ తేదీ నుండి జూన్ 3వ తేదీ వరకు హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరగనుంది. భారతదేశంలో ఇన్‌ఫార్మా మార్కెట్‌చే నిర్వహించబడుతున్న ఫార్మాలిటికా భారతదేశం యొక్క అభివృద్ధి చెందుతున్న ఔషధ పరిశ్రమలో తాజా పురోగతులు మరియు అవకాశాలను అన్వేషించడానికి పరిశ్రమ నాయకులు, ఆవిష్కర్తలు మరియు వాటాదారులను ఒకచోట చేర్చుతుంది. ఈ ఎక్స్‌పో లో 150కి పైగా ప్రముఖ కంపెనీలు మరియు 300+ టాప్-లైన్ బ్రాండ్‌లు పాల్గొననున్నాయి . మూడు రోజుల ఎక్స్‌పో ఫార్మా కమ్యూనిటీని 16 దేశాలు మరియు 21 భారతీయ రాష్ట్రాల నుండి దేశీయ మరియు అంతర్జాతీయ సందర్శకుల ను కలిసే వీలు కల్పిస్తుంది. ఈ ఎక్స్‌పో 2023కి ప్రముఖ ప్రభుత్వ సంస్థ – ఇన్వెస్ట్ తెలంగాణ మరియు బల్క్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, కర్ణాటక డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ వంటి సంఘాలు మద్దతునిస్తున్నాయి. ఫార్మాలిటికా 2023 గురించి ఇన్‌ఫార్మా మార్కెట్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ యోగేష్ ముద్రాస్ మాట్లాడుతూ.. “పూర్తి స్థాయి ఫార్మాస్యూటికల్ ఎకోసిస్టమ్ మరియు పరిశ్రమ వాటాదారులను ఒకచోట చేర్చే ఫార్మాలిటికా ఎక్స్‌పో యొక్క 9వ ఎడిషన్‌ను ప్రకటించినందుకు మేము సంతోషిస్తున్నాము. ఈ ప్రదర్శనకు కీలకమైన ప్రభుత్వ సంస్థ, ఇన్వెస్ట్ తెలంగాణ, మద్దతు ఉంది” “గ్లోబల్ ఫార్మాస్యూటికల్స్ పరిశ్రమలో కీలకమైన ప్లేయర్ గా మరియు ప్రపంచవ్యాప్తంగా జనరిక్ ఔషధాల యొక్క అతిపెద్ద సరఫరాదారుగా, భారతదేశం ఆరోగ్య రంగ నిధులలో గణనీయమైన పెరుగుదలను చూసింది. ప్రముఖ ఫార్మాస్యూటికల్ మార్కెట్‌గా అభివృద్ధి చెందుతున్నవేళ, ఫార్మాలిటికా పెరుగుతున్న డిజిటలైజ్డ్ ఎకోసిస్టమ్‌లో ఒక సమగ్ర ప్లాట్‌ఫారమ్‌గా పనిచేయడం తో పాటుగా స్మార్ట్ ఫార్మా సాంకేతిక హబ్‌లను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది. ” అన్నారు

Spread the love