మార్చి 1 నుంచి టెన్త్‌ ప్రీఫైనల్‌ పరీక్షలు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో పదోతరగతి ప్రీఫైనల్‌ పరీక్షలు వచ్చేనెల ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్‌ ఎం రాధారెడ్డి శుక్రవారం షెడ్యూల్‌ను విడుదల చేశారు. అదేనెల 11వ తేదీ వరకు ఈ పరీక్షలను నిర్వహిస్తామని తెలిపారు. ఇంటర్మీడియెట్‌ వార్షిక పరీక్షలు ఈనెల 28 నుంచి ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. అందుకే పదో తరగతి ప్రీఫైనల్‌ పరీక్షలను మధ్యాహ్నం 1.45 నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు నిర్వహిస్తామని వివరించారు. తొలిసారిగా ఫిజికల్‌ సైన్స్‌, బయలాజికల్‌ సైన్స్‌ సబ్జెక్టులకు వేర్వేరుగా పరీక్షలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. వచ్చేనెల ఒకటిన ఫస్ట్‌ లాంగ్వేజ్‌, రెండున సెకండల్‌ లాంగ్వేజ్‌, నాలుగున థర్డ్‌ లాంగ్వేజ్‌, ఐదున మ్యాథమెటిక్స్‌, ఆరున ఫిజికల్‌ సైన్స్‌, ఏడున బయలాజికల్‌ సైన్స్‌, 11న సోషల్‌ స్టడీస్‌ సబ్జెక్టులకు పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. జిల్లా విద్యాశాఖా ధికారులు (డీఈవో) పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Spread the love