– కేసీఆర్ క్షమాపణ చెప్పాలి : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్‌డీఎస్‌ఏ)తో విచారణ జరిపిస్తామని రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో మంత్రి ఉత్తమ్ ‘మీడియాతో చిట్‌చాట్’ చేస్తూ కేసీఆర్ అన్ని విషయాల్లో అనుభవజ్ఞుడనీ, ఆయన లాగా తాము కాదన్నారు. అందుకే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సలహా అడుగుతున్నామని తెలిపారు. మేడిగడ్డ సంఘటనపై కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల అంచనాలను అడ్డగోలుగా పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిక వడ్డీతో స్వల్పకాలిక అప్పులు తెచ్చారని గుర్తుచేశారు. గతంలో పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌పై కూడా విచారణ చేయిస్తామని వివరించారు. మేడిగడ్డకు కేసీఆర్ వస్తా అంటే స్వాగతిస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.