
శ్రీ సాయి కృప డిగ్రీ అండ్ పీజీ కళాశాల భువనగిరి బంజారా హిల్స్ లో శుక్రవారం టెక్స్ అకాడమీ వారు నిర్వహించిన సాఫ్ట్ స్కిల్స్ మరియు కంప్యూటర్ కోర్సులను అందించడానికి అర్హులు గల విద్యార్థుల కోసం ఆన్లైన్ ద్వారా పోటీ పరీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సాయి కృప డిగ్రీ అండ్ పీజీ కళాశాల డిగ్రీ మూడవ సంవత్సరం చదువుతున్న 2021-2024 షేక్ ముజీబ్ ఎంపికైనందుకు శ్రీ సాయి కృప డిగ్రీ అండ్ పీజీ కళాశాల కరస్పాండెంట్ దరిపల్లి ప్రవీణ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దరిపల్లి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఇలాంటి ఉచిత కోర్సులతో పాటు ప్లేస్మెంట్ అందించే డ్రైవ్ లను విద్యార్థుల సంకేతిక వికాసానికై ఖచ్చితంగా సహాయపడతాయన్నారు. విద్యార్థులు చదువుతో పాటు జీవితంలో నిరంతర కృషి తపనతో ఎన్నో విజయాలు సాధించవచ్చన్నారు. డిగ్రీ కోర్సు పూర్తయిన తర్వాత విద్యార్థులకు ఉద్యోగాలు కల్పిస్తామని, టెక్స్ అకాడమీ గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో ఉద్యోగులుగా ప్రవేశాలు కల్పిస్తామని కార్పొరేట్ కమ్యూనికేషన్స్ మేనేజర్ మోహన్ దాస్ తెలిపారు. శ్రీ సాయి కృప డిగ్రీ అండ్ పీజీ కళాశాల ప్రిన్సిపల్ యాకూబ్ బాబా ఉచిత ఆన్లైన్ పరీక్షను నిర్వహించినందుకు టెక్స్ అకాడమీకి ధన్యవాదాలు తెలిపారు. ఉచిత కోర్సులకు, ఉద్యోగాలకు ఎంపికైనందుకు అభినందనలు తెలిపారు. విద్యార్థులకు సాఫ్ట్ స్కిల్స్ కోర్సులతోపాటు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న టెక్స్ యాజమాన్యానికి ప్లేస్మెంట్ అధికారి మహమ్మద్ మోయిన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు శ్రావణ్ రెడ్డి మహేందర్ మాధవి రామకృష్ణ పరశురాములు దీపికా హారిక స్రవంతి రామాంజనేయులు శ్రీకాంత్ ప్రియాంక ప్లేస్మెంట్ డ్రైవ్ లో విజయం సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు.