జ్ఞానవాపిలో హిందువులు ప్రార్థనలు చేసుకోవచ్చు

Hindus in Gnanavapi You can pray– అలహాబాద్‌ హైకోర్టు తీర్పు
ప్రయాగరాజ్‌ : జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలోని సెల్లార్‌లో హిందువులు ప్రార్థనలు చేసుకోవచ్చునని అలహాబాద్‌ హైకోర్టు సోమవారం తీర్పు చెప్పింది. హిందూ ప్రార్థనలను అనుమతిస్తూ వారణాసి జిల్లా కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. మసీదు నిర్వహణ బాధ్యతలు చూస్తున్న అంజుమన్‌ ఇంతెజామియా మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి రోహిత్‌ రంజన్‌ అగర్వాల్‌ ఈ తీర్పును వెలువరించారు. 17వ శతాబ్ద కాలం నాటి హిందూ దేవాలయాన్ని కూల్చివేసి, అక్కడ మసీదును నిర్మించారంటూ పురావస్తు శాఖ ఇచ్చిన నివేదికను ఆధారంగా చేసుకొని జ్ఞానవాపి కాంప్లెక్స్‌ సెల్లారులో హిందువులు ప్రార్థనలు చేసుకోవచ్చునంటూ జనవరి 31న వారణాసి కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

Spread the love