
– నిమిషం ఆలస్యమైన ప్రవేశం లేదు
– మాల్ ప్రాక్టీసుకు పాల్పడితే క్రిమినల్ చర్యలు
నవతెలంగాణ – బెజ్జంకి
మండలంలో నేడు ఇంటర్ వార్షిక పరీక్షలు ప్రారంభమవ్వనున్నాయి.మార్చి 16 వరకు ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల యందు ఏర్పాటుచేసిన పరీక్ష కేంద్రంలో నిర్వహిస్తున్న పరీక్షలకు మండలంలో 356 మంది విద్యార్థులు హాజరవుతున్నారన్నట్టు పరీక్షల నిర్వహణ అధికారి ధనరాజ్ మంగళవారం తెలిపారు. మొదటి సంవత్సరంలో 190,రెండవ సంవత్సరంలో 165 మంది విద్యార్థులు పరీక్షలకు హజరవుతున్న దృష్ట్యా పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశామని డీఓ వెంకట క్రిష్ణ తెలిపారు.పరీక్షల నిర్వహణను ఎప్పటికప్పుడు సిట్టింగ్ స్కార్డ్ పర్యవేక్షిస్తారని సీఎస్ తెలిపారు.
నిమిషం ఆలస్యమైన ప్రవేశం లేదు: ఇంటర్ పరీక్షలకు హజరయ్యే విద్యార్థులు ఒక్క నిమిషం ఆలస్యమైన పరీక్ష కేంద్రంలోకి ప్రవేశం లేదు.నిమిషం ఆలస్యం నిబందనను ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేస్తుందని విద్యార్థులు నిర్లక్యంగా వ్యవహరించకుండా ఉదయం 8.15 గంటల వరకు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సీఎస్ ధనరాజ్ సూచించారు.
మాల్ ప్రాక్టీసుపై క్రిమినల్ చర్య: పరీక్షా కేంద్రంలో విద్యార్థులు మాల్ ప్రాక్టీసుకు పాల్పడితే ప్రభుత్వం చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటుందని పరీక్షలకు హజరయ్యే విద్యార్థులు పరీక్షా కేంద్రంలో ప్రభుత్వ నిబంధనలను పాటించాలని డీఓ వేంకట క్రిష్ణ హెచ్చరించారు.