చురుగ్గా సాగుతున్న సీసీరోడ్డు నిర్మాణం పనులు

– పరిశీలించిన నాయకులు కొండ రాజు, ఈరన్న

నవతెలంగాణ –  మద్నూర్
మద్నూర్ మండలంలోని పెద్ద తడగూరు గ్రామంలో ఐదు లక్షల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణం పనులు చురుగ్గా సాగుతున్నాయి. సీసీ రోడ్డు నిర్మాణం పనులను బుధవారం నాడు ఆ గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొండ రాజు, ఈరన్న, ఇతరులు కలిసి పరిశీలించారు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సంక్షేమ పథకాల అమలు పరుస్తూ గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తుందని ఆ నాయకులు పేర్కొన్నారు.
Spread the love