-10 మంది విద్యార్థుల గైర్హాజర్
– ఆలస్యమైన విద్యార్థిని ఇంటిముఖం
నవతెలంగాణ – బెజ్జంకి
మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటుచేసిన చేసిన పరీక్షా కేంద్రంలో బుధవారం ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగాప్రారంభమైయ్యాయి. ప్రభుత్వ అదేశాలను పరీక్షల నిర్వహణ సిబ్బంది పకడ్బందీగా అమలు చేశారు.పరీక్షలకు హజరయ్యే ప్రతి విద్యార్థిని పరీక్షల నిర్వహణ సిబ్బంది తనిఖీలు చేపట్టి పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు.10 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరైనట్టు పరీక్ష కేంద్రం నిర్వహణాధికారి ధనరాజ్ తెలిపారు.
14 ని.ఆలస్యంతో..ఇంటిముఖం: పరీక్షా కేంద్రానికి విద్యార్థిని సుమారు 14 ని.ఆలస్యంగా హజరైంది.పరీక్షల నిర్వహణ అధికారులు ఒక్క నిమిషం ఆలస్యం నిబంధన అమలు చేశారు.దీంతో విద్యార్థిని అధికారుల వద్ద రోదిస్తూ పరీక్ష రాసేందుకు అనుమతివ్వాలని ప్రాదేయపడింది. అనుమతి నిరాకరించడంతో విద్యార్థిని ఇంటిముఖం పట్టింది.