ప్రశాంతంగా ఇంటర్ ద్వితీయ పరీక్షలు 

– ముగ్గురు విద్యార్థుల గైర్హాజర్ 
– చివరి నిమిషంలో  విద్యార్థికి అనుమతి
నవతెలంగాణ – బెజ్జంకి
మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన చేసిన పరీక్షా కేంద్రంలో గురువారం ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమైయ్యాయి. ప్రభుత్వ అదేశాలను పరీక్షల నిర్వహణ సిబ్బంది పకడ్బందీగా అమలు చేశారు.పరీక్షలకు హజరయ్యే ప్రతి విద్యార్థిని పరీక్షల నిర్వహణ సిబ్బంది తనిఖీలు చేపట్టి పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు.161 మంది విద్యార్థులకు ముగ్గురు విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరైనట్టు పరీక్ష కేంద్రం నిర్వహణాధికారి డీఓ వెంకట క్రిష్ణ తెలిపారు.సరాసరి ఉదయం 9 గం.పరీక్షా కేంద్రం అవరణలోకి ప్రవేశించిన విద్యార్థిని పరీక్ష రాసేందుకు అనుమతించారు.ఒక్క అలస్యం నిబంధన పకడ్బందీగా అమలు చేస్తున్న దృష్ట్యా విద్యార్థులు నిర్దేశించిన సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సీఐ ధనరాజ్ హెచ్చరించారు.
Spread the love