నవతెలంగాణ – బెజ్జంకి
గత ప్రభుత్వం అమలు చేసిన మూడెకరాల భూ పంపిణీలో మాకు న్యాయం చేయాలంటూ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యలయ అవరణం వద్ద పలువురు గూడెం గ్రామస్తులు గురువారం రెండో రోజు నిరాహారదీక్ష సాగించారు. అధికారులు 34 మందికి భూ పంపిణీ చేశారని..భూ పంపిణీ చేసిన వారిలో కొందరు గతంలో తమ వ్యవసాయ భూములు విక్రయించుకుని మూడెకరాల భూ పంపిణీలో మళ్లీ లబ్దిపొందారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. లబ్ధిదారుల గత రెవెన్యూ రికార్డులను పునఃపరిశీలించి గ్రామ సభ ద్వార మళ్లీ లబ్ధిదారులను ఎంపిక చేసి మాకు చేయాలని బాధితులు అధికారులను విజ్ఞప్తి చేశారు.