నేడు మేడిగడ్డకు బీఆర్‌ఎస్‌ బృందం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై తమ వాదనలు ప్రజలకు వినిపించేందుకు నేడు మేడిగడ్డను బీఆర్‌ఎస్‌ బృందం సందర్శించనుంది. ఈ మేరకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పర్యటన వివరాలను వెల్లడించారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, ఇంజినీర్లు, మీడియా ప్రతినిధులు, ఇతర సాంకేతిక నిపుణులతో కూడిన బృందం ఈ పర్యటనలో పాల్గొంటుందని పేర్కొన్నారు.
ఉదయం ఎనిమిది గంటలకు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌నుంచి రెండు బస్సుల్లో బయలుదేరి మద్యాహ్నం ఒంటి గంట వరకు భూపాల్‌ పల్లికి చేరుకుంటుందని తెలిపారు. భోజనం అనంతరం మేడిగడ్డను సందర్శించి అక్కడే మీడియా సమావేశంతో పాటు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ నిర్వహిస్తామని వెల్లడించారు. అన్నారం బ్యారేజిని సైతం సందర్శించి కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ఆవశ్యకతను ప్రజలకు వివరిస్తామని కేటీఆర్‌ వివరించారు.

Spread the love