– అవగాహన సదస్సును బహిష్కరించిన గుగ్గీల్ల,తిమ్మాయిపల్లి, నర్సింహుల పల్లి గ్రామస్తులు
– చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు: సీఐ శ్రీనివాస్
నవతెలంగాణ – బెజ్జంకి
మాకు అవగాహన వద్దు..ఇథనాల్ పరిశ్రమ నిర్మాణమే వద్దంటూ పలువురు గుగ్గీల్ల,తిమ్మాయిపల్లి,నర్సింహుల పల్లి గ్రామస్తులు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అవగాహన సదస్సును బహిష్కరించారు.శనివారం మండల పరిధిలోని బెజ్జంకి క్రాసింగ్ గ్రామంలో ఓ పంక్షన్ హాల్ యందు పరిశ్రమ ప్రతినిధులతో కలిసి సీఐ శ్రీనివాస్ అధ్వర్యంలో ఇథనాల్ పరిశ్రమపై అయా గ్రామస్తులకు నెలకొన్న అపోహలను నివృత్తి చేయడానికి అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు.అవగాహన కార్యక్రమ మద్యలో మాకు పరిశ్రమ వద్దంటూ అయా గ్రామాల ప్రజలు బహిష్కరించి వెళ్లడం విశేషం.చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు చేపడుతామని సీఐ శ్రీనివాస్ అయా గ్రామాల గ్రామస్తులకు హెచ్చరించారు.అంతకుముందు మండల కేంద్రంలో ఇసుక రవాణ చేస్తున్న ట్రాక్టర్ల అనుమతులను సీఐ శ్రీనివాస్ ఎస్ క్రిష్ణారెడ్డితో కలిసి తనిఖీ చేశారు.