
మండల పరిధిలోని అయా గ్రామాల్లో సుమారు 1810 మంది చిన్నారులకు పోలియో చుక్కలు పంపిణీ చేసినట్టు వైద్యాధికారి వినోద్ బాబ్జీ అదివారం తెలిపారు.మండలంలో 1835 మంది చిన్నారులకు(బెజ్జంకి 987,తోటపల్లి 823)పోలియో చుక్కలను ఆరోగ్య కేంద్రం సిబ్బంది పంపిణీ చేశామని చుక్కలు వినియోగించుకోని వారికి నేటి నుండి ఇంటింటా పంపిణీ చేయనున్నట్టు వైద్యాధికారి తెలిపారు.