Tuesday, June 10, 2025
E-PAPER
Homeసినిమానా శివుడి అనుమతి లేనిదే..

నా శివుడి అనుమతి లేనిదే..

- Advertisement -

బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో రాబోతున్న చిత్రం ‘అఖండ 2: తాండవం’. 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌పై నిర్మాతలు రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట అత్యంత భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎం. తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. బాలకష్ణ పుట్టినరోజు(జూన్‌ 10) పురస్కరించుకొని ‘అఖండ 2: తాండవం’ సెన్సేషనల్‌ టీజర్‌ని రిలీజ్‌ చేశారు మేకర్స్‌. టీజర్‌ అదిరిపోయింది. ఈ టీజర్‌తో బాలయ్య బెస్ట్‌ బర్త్‌ డే గిఫ్ట్‌ అందించింది చిత్ర బృందం.
ఈ టీజర్‌లో అద్భుతమైన ఎలిమెంట్‌ ఫెరోషియస్‌, డివైన్‌తో కూడిన బాలకష్ణ సెన్సేషనల్‌ లుక్‌. ఇది పాత్రకు పర్ఫెక్ట్‌ యాప్ట్‌ అయ్యింది. బాలకష్ణను అందరికంటే అద్భుతంగా ప్రెజంట్‌ చేయగలరని బోయపాటి మరోసారి నిరూపించారు. టీజర్‌లో త్రిశూలం, నంది, మంచుతో కప్పబడిన కైలాసం నేపథ్యం మెస్మరైజ్‌ చేశాయి. ఇది పాత్ర వెనుక ఉన్న రీసెర్చ్‌, సినిమా ఇతివత్తాన్ని ప్రజెంట్‌ చేశాయి. బాలకష్ణ ఫెరోషియస్‌ యాక్షన్‌ గూస్‌ బంప్స్‌ తెప్పించింది. ‘నా శివుడి అనుమతి లేనిదే ఆ యముడైన కన్నెత్తి చూడడు. నువ్వు చూస్తావా.. అమాయకుల ప్రాణాలు తీస్తావా’ అంటూ అఘోర పాత్రలో బాలయ్య చెప్పిన పవర్‌ ఫుల్‌ డైలాగ్‌ మెస్మరైజ్‌ చేసింది.
రౌడీలని పక్కకు విసిరే సన్నివేశాలు, త్రిశూలం షాట్‌ మైండ్‌ బ్లోయింగ్‌గా ఉన్నాయి. యాక్షన్‌ కొరియోగ్రాఫర్లు రామ్‌-లక్ష్మణ్‌ బాలకృష్ణ మాస్‌ అప్పీల్‌ను అద్భుతంగా ప్రజెంట్‌ చేశారు. బాలకృష్ణ చెప్పిన డైలాగులు పవర్‌ ఫుల్‌గా, అద్భుతంగా ఉన్నాయి. థమన్‌ నేపథ్య సంగీత నెక్స్ట్‌ లెవల్‌లో ఉంది. బాలకష్ణ చిత్రానికి సంగీతం అందించే విషయంలో థమన్‌ కంప్లీట్‌ డిఫరెంట్‌ వరల్డ్‌ లో చేస్తారని మరోసారి రుజువైయింది. 14 రీల్స్‌ ప్లస్‌ నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. ప్రతి ఫ్రేమ్‌ చాలా గ్రాండియర్‌గా ఉంది. ప్రస్తుతం ఈ సినిమాను జార్జియాలోని గ్రాండ్‌ లొకేషన్స్‌తో చిత్రీకరిస్తున్నారు. సెప్టెంబర్‌ 25న దసరా స్పెషల్‌గా థియేటర్లలో ఈ సినిమా తాండవం చేస్తుందని మేకర్స్‌ తెలియజేశారు. ఈ సినిమా దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. ఈ చిత్రంలో సంయుక్త హీరోయిన్‌గా నటిస్తుంది. ఆది పినిశెట్టి ఇంటెన్స్‌ పాత్రని పోషిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -