నవతెలంగాణ – బెజ్జంకి
ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా గుగ్గీల్ల గ్రామ శివారులో నిర్మించ తలపెట్టిన ఇథనాల్ పరిశ్రమ నిర్మాణ అనుమతులను ప్రభుత్వం బేషరతుగా రద్దు చేయాలని సీపీఐ మండల కార్యదర్శి బోనగిరి రూపేశ్ బుధవారం డిమాండ్ చేశారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా పరిశ్రమ నిర్మాణం చేపట్టేల ప్రభుత్వం వ్యవహరిస్తే సీపీఐ పార్టీ అధ్వర్యంలో పెద్దఎత్తున ఉద్యమాలు ఉదృతం చేస్తామని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పోతిరెడ్డి వెంకట రెడ్డి హెచ్చరించారు.