– ఎంపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ (సీఈసీ) సమావేశాలు గురువారం ఢిల్లీలో జరగనున్నాయి. రెండు రోజులపాటు జరగనున్న సమావేశానికి పీసీసీ అధ్యక్షుడి హోదాలో సీఎం రేవంత్‌రెడ్డి హాజరు కానున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర రాజకీయ పరిస్థితులను కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ ముందు ఉంచనున్నారు. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తయింది. సమావేశాల్లో చర్చించిన తర్వాత అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో ఎంపీ అభ్యర్థుల ఎంపిక బాధ్యతను అధిష్టానం రేవంత్ అప్పగించింది. తెలంగాణ రాష్ట్రంలో ఏకాభిప్రాయం ఉన్న సీట్లను ఏఐసీసీ ప్రకటించనున్నట్టు ఆ వర్గాలు చెబుతున్నాయి.