– మండలంలో భక్తి శ్రద్ధలతో మహాశివరాత్రి వేడుకలు
– కాశీ లింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
నవతెలంగాణ – బెజ్జంకి
హరోం..హర..శంబో శివ శంకరా అనే శివనామస్మరణలతో మండలంలోని ఆలయాలు మారుమ్రోగాయి.శుక్రవారం మండలంలోని అయా గ్రామాల ఆలయాల్లో ప్రజలు ప్రత్యేక పూజలు చేసి భక్తి శ్రద్ధలతో మహాశివరాత్రి పండుగ వేడుకలను వైభవంగా జరుపుకున్నారు.భక్తులు మహాశివరాత్రి పర్వదినాన జాగారం పాటించడం తరతరాల అనవాయితీగా సాగుతోంది.
కాశీ లింగేశ్వర స్వామి ఆలయంలో.. మండల పరిధిలోని లక్ష్మిపూర్ గ్రాశలమంలో ఇటీవల కాశీ లింగేశ్వర స్వామి ఆలయంలో స్థిర ప్రతిష్టాపన మహోత్సవాలు వైభవంగా నిర్వహించడంతో అభివృద్ది కమిటీ సభ్యులు ఆలయంలో మహాశివరాత్రి పండుగ వేడుకల నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.కాశీ లింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక హోమం,అభిషేకం,లింగోద్భావ ప్రత్యేక పూజలు నిర్వహించారు.మండలంలోని అయా గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో హజరై దర్శనం చేసుకున్నారు.