
నవతెలంగాణ – బెజ్జంకి
మండల పరిధిలోని లక్ష్మిపూర్ గ్రామంలోని కాశీ లింగేశ్వర స్వామి ఆలయ హుండి లెక్కింపు శనివారం నిర్వహించినట్టు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. ఆలయ అవరణం వద్ద నిర్వహించిన మొదటి హుండి లెక్కింపులో సుమారు రూ.36,676 అదాయం సమకూరినట్టు ఆలయ అభివుద్ధి కమిటి సభ్యులు తెలిపారు.