
నవతెలంగాణ – బెజ్జంకి
బ్లాక్ లేవల్ క్రీడల్లో మండల కేంద్రంలోని ఆదర్శ విద్యాలయ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చి ప్రశంసా పత్రాలతో పాటు బహుమతులు అందుకున్నారు.శుక్రవారం ఆదర్శ విద్యాలయ క్రీడా మైదానంలో బ్లాక్ లెవల్ 2024 ఏడాది కోకో,కబడ్డీ, వాలీబాల్ క్రీడల పోటీలు నిర్వహించారు. అయా క్రీడల్లో ఆదర్శ విద్యాలయ విద్యార్థులు పీఈటీ కనకారెడ్డి శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబర్చారు. ప్రధానాచార్యలు హర్జీత్ కౌర్ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రశంస పత్రాలతో పాటు బహుమతులు ప్రధానం చేశారు.విద్యాలయ బోధన సిబ్బంది పాల్గొన్నారు.