బీఆర్ఎస్, బీజేపీల నుండి కాంగ్రెస్ లో చేరిక..

నవతెలంగాణ – నవీపేట్
మండలంలోని నిజాంపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్, బీజేపీల నుండి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నివాసంలో శనివారం కాంగ్రెస్ కండువా కప్పుకొని తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ అంజా గౌడ్, వడ్ల పోశెట్టి, పంతులు సాయిలు, మచ్చర్ల నాగన్న, పోతన్న, తెలుగు నర్సయ్య, గిరిజపతి, ఒడ్డెన్న తదితరులు పార్టీలో చేరారు.
Spread the love