రూ.1.14 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన 

– బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దామోదర్

నవతెలంగాణ – బెజ్జంకి 
మండల పరిధిలోని అయా గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సుమారు రూ.1.14 కోట్ల ప్రత్యేక అభివృద్ధి నిధులు కేటాయించారని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్ శనివారం తెలిపారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి కేటాయించిన నిధులతో మండలంలోని గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశామని దామోదర్ తెలిపారు. ప్రత్యేక అభివృద్ధి నిధులు కేటాయించి మండలాభివృద్ధకి కృషి చేసిన ఎమ్మెల్యేకు మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.
Spread the love