నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రం నుంచి రాజ్యసభ ఎంపీగా తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికైన వద్దిరాజు రవిచంద్రకు ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మెన్ జగదీప్ ధనఖర్ శుభాకాంక్షలు తెలిపారు. రెండోసారీ ఎన్నికైన తర్వాత వద్దిరాజు ధన్కర్ను బుధవారం ఢిల్లీలో మర్యాద పూర్వకంగా కలిశారు. పార్లమెంట్ సభ్యుడిగా ప్రజలకు మరింత బాధ్యతతో సేవలందించాలని ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి సూచించారు.