బావిలో పడి వృద్ధురాలి మృతి

నవతెలంగాణ – తలకొండపల్లి
మండల పరిధిలోని గురువారం చీపునుంతల గ్రామానికి చెందిన మల్తాకర్ నర్సమ్మ (60)గత కొన్ని రోజుల నుంచి పెద్ద కుమార్తె అమృత తో చిన్న చిన్న విషయాలకు నేను చనిపోతా అంటూ రోజు బెదిరించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఐ ఎ. శ్రీకాంత్ మాట్లాడుతూ నర్సమ్మ భర్త ఆరు సంవత్సరాల క్రితం చనిపోయాడు.రెండు రోజుల క్రితం చనిపోతా అంటూ బెదిరించి ఇంట్లో నుంచి వెళ్లిపోయి సాయంత్రం తిరిగి వచ్చింది.బుధవారం ఉదయం ఇంట్లో నుంచి బయలుదేరి వెళ్లిపోయింది సాయంత్రం వరకు ఇంటికి తిరిగి రాలేదు అంతట వాళ్లు చుట్టుపక్కల మొత్తం వెతకారు ఎక్కడ కూడా దొరకలేదు. చీపునుంతల గ్రామం నుంచి సాలార్పూర్ వెళ్లే మట్టి దారి పక్కన బావి దగ్గర ఆమె చెప్పులు కనిపించాయి అనుమానం వచ్చి బావిలో వెతికించగా ఈరోజు ఉదయం 6 గంటల సమయంలో శవం దొరికింది, పెద్ద కూతురు అమృత ఫిర్యాదు ఇవ్వడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నాం అని తలకొండపల్లి ఎస్ఐ ఎ. శ్రీకాంత్ తెలిపారు.
Spread the love