– పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు
– బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్పు
నవతెలంగాణ – ఆమనగల్
ఐక్యత ఫౌండేషన్ చైర్మెన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి మంగళవారం కల్వకుర్తి నియోజకవర్గంలో అభిమానులు, పార్టీ నాయకులతో కలిసి సుడిగాలి పర్యటన నిర్వహించారు. ఈసందర్భంగా ముందుగా కడ్తాల్ మండలంలోని అన్మాస్ పల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారాముల స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలందరు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు. ఈసందర్భంగా ఆలయ నిర్వాహకులు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డితో పాటు నాగర్ కర్నూల్ జిల్లా డీసీసీ ఉపాధ్యక్షులు సుంకిరెడ్డి వరప్రసాద్ రెడ్డి తదితరులను పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించి సత్కరించారు. అనంతరం ఆయన నియోజకవర్గంలోని ఆయా గ్రామాల్లో జరిగిన శుభ కార్యాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా పలువురు బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. ఈకార్యక్రమంలో మాజీ సర్పంచ్లు పోతుగంటి శంకర్, రచ్చ శ్రీరాములు, ఆలయ చైర్మెన్ సుధీర్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ అనిల్ కుమార్, నాయకులు రవీందర్ గౌడ్, కేశవులు, శ్రీరాములు, కృష్ణ, భరత్ యాదవ్, సాయిలు, సుంకిరెడ్డి అభిమానులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.