అల్ఫాజోలం మత్తుమందు పట్టివేత..

– కొత్తూరు లో ఎస్ ఓ టి పోలీసుల దాడులు.
– 13 లక్షల రూపాయల విలువ చేసే ఆల్ఫా జొలం, మూడు సెల్ ఫోన్లు, ఒక కారు స్వాధీనం.
నవతెలంగాణ – కొత్తూరు
అక్రమ సంపాదనే ధ్యేయంగా కల్లు లో కలిపి నిషేధిత ఆల్ఫా జోలం మత్తుమందును రాష్ట్రమంతా సరఫరా చేస్తూ సొమ్ము చేసుకుంటున్న ముగ్గురు వ్యక్తులను సోమవారం కొత్తూరు పట్టణ కేంద్రంలో ఎస్ఓటి పోలీసులు పట్టుకున్నారు. కొత్తూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కొత్తూరు పట్టణ కేంద్రంలోని విజయలక్ష్మి ఇండస్ట్రియల్ ఏరియా నందు నిషేధిత ఆల్ఫా జొలం మత్తు మందును తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను గుర్తించి వారి నుండి సుమారు కేజీ విలువచేసే ఆల్ఫా జొలం ను స్వాధీనం చేసుకున్నారు. వారి నుండి 13 లక్షల విలువ చేసే సుమారు కిలో ఆల్ఫా జొలం మత్తుమందు, మూడు సెల్ ఫోన్లు, వారు ఉపయోగిస్తున్న కారును స్వాధీనం స్వాధీనపరచుకొని సీజ్ చేయడం జరిగింది. నిందితులు మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం వెలికిచర్ల గ్రామానికి చెందిన అనిల్ గౌడ్, మహబూబ్నగర్ పట్టణ ప్రాంతానికి చెందిన సుధాకర్, నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం నేరేళ్లపల్లి గ్రామానికి చెందిన శరత్ బాబులుగా గుర్తించారు. నిందితులను అరెస్టు చేసి విచారించగా నాగర్ కర్నూల్, జడ్చర్ల, హైదరాబాద్ తదితర ప్రాంతాలలో పరపర చేస్తున్నట్లు తెలిసింది. తదుపరి విచారణ జరుగుతున్నట్లు కొత్తూరు సిఐ నరసింహారావు తెలిపారు.
Spread the love