ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన లారీ..

– ముగ్గురి యువకుల పరిస్థితి విషమం 

నవతెలంగాణ – బెజ్జంకి 
రాత్రి సమయంలో రాజీవ్ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టిన సంఘటన శుక్రవారం మండల పరిధిలోని తోటపల్లి శివారులో చోటుచేసుకుంది. శనివారం ప్రమాద సంఘటన వివరాలను పోలీసులు వెల్లడించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం జుగుండ్ల గ్రామానికి చెందిన ధర్మేందర్, సంపత్, సంపత్ ముగ్గురు యువకులు కలిసి ద్విచక్ర వాహనంపై సిద్దిపేట నుండి కరీంనగర్ వెళ్తున్నారు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనం వెనుక భాగంలో లారీ డికోట్టడంతో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. అంబులెన్స్ యందు ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. యువకుల పరిస్థితి విషమంగా ఉందని..లారీ డ్రైవర్ స్వల్ప గాయాలతో ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు.
Spread the love